Nara Lokesh: ఉండవల్లి చేరుకున్న నారా లోకేశ్, భువనేశ్వరి

Nara Lokesh and Bhuvaneswari arrives Undavalli

  • ఏపీలో రేపు ఓట్ల లెక్కింపు
  • ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ
  • ఇప్పటికే రాష్ట్రానికి తిరిగొచ్చిన జగన్, చంద్రబాబు

ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది ఎవరో రేపటితో వెల్లడి కానుంది. వైసీపీ, టీడీపీ నేతలు ఎవరికి వారే తామే గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, రేపటి కౌంటింగ్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ తర్వాత విదేశాలకు వెళ్లిన సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు ఇప్పటికే రాష్ట్రానికి తిరిగొచ్చారు. 

తాజాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, నారా భువనేశ్వరి కూడా నేడు ఉండవల్లి నివాసానికి తిరిగొచ్చారు. హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న లోకేశ్, భువనేశ్వరిలకు ఎయిర్ పోర్టులో టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. 

గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తదితర నేతలు లోకేశ్, భువనేశ్వరిలకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. లోకేశ్, భువనేశ్వరి గన్నవరం నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉండవల్లిలోని తమ నివాసానికి బయల్దేరి వెళ్లారు.

Nara Lokesh
Nara Bhuvaneswari
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News