IMD: తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

Southwest monsoon entered into telangana

  • తెలంగాణలో చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు
  • నాగర్ కర్నూల్, గద్వాల్, నల్గొండలోకి ప్రవేశం 
  • ఈ ఏడాది వారం రోజుల ముందే రాక 

నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకాయి. రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్నాయి. రుతుపవనాలు నాగర్ కర్నూల్, గద్వాల్, నల్గొండలో ప్రవేశించాయి. సాధారణంగా తెలంగాణలోకి జూన్ రెండో వారంలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈసారి మాత్రం వారం రోజుల ముందే ప్రవేశించాయి.

ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం కారణంగా సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలోని దక్షిణ ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కావొచ్చునని వాతావరణ శాఖ తెలిపింది.

  • Loading...

More Telugu News