K. Kavitha: కవిత కస్టడీని పొడిగించిన కోర్టు

BRS MLC K Kavitha Slogan In Delhi Court Hall

  • జులై 3 వరకు జైలులోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
  • భారీ భద్రత నడుమ కోర్టుకు తరలించిన పోలీసులు
  • జై తెలంగాణ, జై భారత్ అంటూ కవిత నినాదం

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీని కోర్టు పొడిగించింది. జులై 3 వరకు కస్టడీని పొడిగిస్తూ సోమవారం రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆదివారంతో కవిత కస్టడీ ముగియడంతో సోమవారం ఆమెను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. భారీ భద్రత నడుమ కవితను కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టు హాలులో ఉన్న మీడియా ప్రతినిధులను చూస్తూ ఎమ్మెల్సీ కవిత.. జై తెలంగాణ, జై భారత్ అని నినాదం చేస్తూ కోర్టు లోపలికి వెళ్లారు. కోర్టు హాలులో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More Telugu News