Prashant Kishor: ఎగ్జిట్ పోల్స్ తర్వాత తొలిసారి స్పందించిన ప్రశాంత్ కిశోర్.. పనికిమాలిన చర్చలతో సమయాన్ని వృథా చేయొద్దని సూచన

Prashant Kishors first reaction after exit polls

  • ప్రశాంత్ కిశోర్ చెప్పిన దాంతో సరిపోలుతున్న ఎగ్జిట్ పోల్స్
  • ఫేక్ జర్నలిస్టులు, నోరేసుకుని పడిపోయే రాజకీయ నాయకుల చర్చల్లోకి దూరొద్దని సూచన
  • బీజేపీకి 400 సీట్లు రావని అంచనా వేసిన పీకే

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలైన తర్వాత తొలిసారి రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్ ఎక్స్ ద్వారా స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ దాదాపుగా ప్రశాంత్ కిశోర్ చెప్పినట్టుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్స్‌లో ఓ పోస్టును షేర్ చేసిన ప్రశాంత్ కిశోర్.. ‘‘వచ్చేసారి రాజకీయాలు, ఎన్నికలకు సంబంధించిన చర్చ వచ్చినప్పుడు పనికిమాలిన చర్చలు, ఫేక్ జర్నలిస్టులు, పెద్ద నోరేసుకుని పడిపోయే రాజకీయ నాయకులు, స్వయం ప్రకటిత సోషల్ మీడియా నిపుణుల విశ్లేషణల్లో దూరి మీ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దు’’ అని సూచించారు.

దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. ఎన్డీయేకు 361 నుంచి 401 సీట్ల వరకు వస్తాయని ఇండియా టుడే-మై యాక్సిస్ ఇండియా ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఇండియా కూటమి 131 నుంచి 166 స్థానాలకు పరిమితమవుతుందని తేల్చి చెప్పింది. 

ప్రశాంత్ కిశోర్ కూడా ఇదే విషయం చెప్పారు. 2019 ఫలితాలు రిపీట్ అవుతాయని పేర్కొన్నారు. అయితే, 400 మార్క్ దాటడం కష్టమని తేల్చి చెప్పారు. బీజేపీకి 270 సీట్లు కూడా రావని అందరూ అనుకుంటున్నదని తప్పదని, 370 సీట్లకు పైనే గెలుచుకుంటుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో తాజాగా పీకే ఇలా స్పందించారు.

Prashant Kishor
Exit Polls
BJP
INDIA
  • Loading...

More Telugu News