Sonia Gandhi: రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం.. గ్యారంటీలను అమలు చేస్తాం: సోనియా గాంధీ వీడియో సందేశం

Sonia Gandhi Video Message To Telangana People

  • తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
  • వీడియో సందేశం విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్
  • ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించిన రాష్ట్ర నేతలు

తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో గ్యారంటీలను అమలు చేస్తామని సోనియా గాంధీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు యూపీఏ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు వీడియో సందేశం పంపారు. ఈ వీడియోను రాష్ట్ర ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో సోనియా గాంధీ పాల్గొనాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లి సోనియాను ఆహ్వానించారు.

ఈ ఆహ్వానాన్ని మన్నించిన సోనియా.. తర్వాత వైద్యుల సూచనతో హైదరాబాద్ ప్రయాణం రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఓ వీడియో సందేశం రిలీజ్ చేశారు. ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వప్నాన్ని నెరవేరుస్తామని 2004లో కరీంగనర్‌ సభలో హామీ ఇచ్చాం. గడచిన పదేళ్లుగా ప్రజలు మా పార్టీ పట్ల అత్యంత ప్రేమ, అభిమానాలు చూపారు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా మా పార్టీ పనిచేస్తుంది. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తాం’’ అని సోనియా గాంధీ తెలిపారు.

More Telugu News