Vamsi: అప్పట్లో బాలూ ఎంత బిజీ అంటే .. : డైరెక్టర్ వంశీ

Vamsi Interview

  • 1985లో వచ్చిన 'అన్వేషణ' 
  • అప్పట్లో అదొక ట్రెండ్ సెట్టర్
  • ఆ సినిమా పాటలపై స్పందించిన వంశీ 
  • బాలూ కోసం 3 నెలలు వెయిట్ చేశామని వెల్లడి


వంశీ ఒక ట్రెండ్ .. చాలా తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను అలరించడం ఆయనకి బాగా తెలుసు. పల్లెటూళ్లు .. పంటకాలువలు .. గోదారి గట్లు ఇవే ఆయన కథకు వేదికలు. కథ ఏదైనా ముందుగా ఆయన ప్రకృతికి ఒక పాత్రను ఇచ్చేస్తారు. అలాంటి వంశీ నుంచి వచ్చిన సినిమాలలో 'అన్వేషణ' ఒకటి. అప్పట్లో ఫారెస్టు నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా, పెద్ద విజయాన్ని సాధించింది. 

అలాంటి 'అన్వేషణ' గురించిన విషయాలను ఆయన తన వీడియో ద్వారా పంచుకున్నారు. ఈ సినిమా పాటలకి సంబంధించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, "ఈ సినిమాకి ఇళయరాజా గారు సంగీతం .. ఆయన ట్యూన్లు ఇచ్చేశారు .. వేటూరి గారు పాటలు రాసేశారు. ఆ సమయానికి అమెరికాలో ఉన్న బాలూగారు .. ఆ తరువాత తిరిగి వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి ఆయన వీర బిజీ. 

"బాలూగారు అమెరికా నుంచి తిరిగి వచ్చేలోగా, ఆయన పాడవలసిన ట్రాకులు కుప్పలు తెప్పలుగా పడివున్నాయి. అయినా ఆయన టెన్షన్ పడకుండా .. అందరినీ నవ్వుతూ పలకరిస్తూ ఉండేవారు. రాత్రి .. పగలనక ఆయన అలా పాడుతూనే ఉన్నారు. అలా ఆయన నా పాట వరకూ వచ్చేసరికి 3 నెలలు పట్టింది. ఇక గ్లామరస్ పాత్ర కోసం వెయిట్ చేస్తున్న భానుప్రియ, ఈ సినిమాలో రోల్ గురించి చెప్పగానే సంతోషపడిపోయింది" అని చెప్పారు. 

  • Loading...

More Telugu News