Election Commission: రేపటి ఎగ్జిట్ పోల్స్‌పై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

EC orders on exit polls

  • రేపు సాయంత్రం 6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలన్న ఈసీ
  • ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126ఏ(1) ప్రకారం నిబంధనలు పాటించాలని స్పష్టీకరణ
  • లోక్ సభ ఎన్నికలతో పాటు ఒడిశా, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు

రేపు లోక్ సభ ఎన్నికల తుది దశ పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత రానున్న ఎగ్జిట్ పోల్స్‌పై కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు సాయంత్రం నిర్ణీత సమయం కంటే ముందు ఫలితాలను ఇవ్వకూడదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. రేపు సాయంత్రం 6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని తెలిపింది. ప్రజాప్రాతినిథ్య చట్టం సెక్షన్ 126ఏ(1) ప్రకారం నిబంధనలు పాటించాలని పేర్కొంది.

లోక్ సభ ఎన్నికలతో పాటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, అలాగే దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలలోని 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. రేపటి వరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఈసీ బ్యాన్ చేసింది. పూర్తిస్థాయిలో పోలింగ్ ముగిసిన తర్వాతే అంచనాలు వెల్లడించాలని పేర్కొంది.

Election Commission
Lok Sabha Polls
  • Loading...

More Telugu News