Aeroplane: విస్తారా విమానానికి బాంబు బెదిరింపు... శ్రీనగర్ విమానాశ్రయంలో కార్యకలాపాలకు అంతరాయం

Srinagar bound Vistara aircraft receives bomb threat
  • 178 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయలుదేరిన విమానం
  • విస్తారా విమానం గాల్లో ఉండగానే బాంబు బెదిరింపు
  • విమానం ల్యాండ్ కాగానే క్షుణ్ణంగా తనిఖీ చేసిన అధికారులు
  • ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్న అధికారులు

విస్తారా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. మార్గమధ్యంలో ఉన్న విమానానికి బాంబు బెదిరింపు రావడంతో శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఎయిర్ విస్తారాకు చెందిన ఓ విమానం 178 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు బయలుదేరింది. అయితే ఆ విమానంలో బాంబు ఉందంటూ శ్రీనగర్ ఏటీసీకి సమాచారం వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

విమానం సురక్షితంగా ల్యాండ్ కాగానే ప్రయాణికులను, సిబ్బందిని దించారు. ఆ తర్వాత విమానాన్ని ఖాళీ ప్రదేశానికి తరలించారు. బాంబు స్క్వాడ్, జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఈ సమయంలో దాదాపు గంటసేపు విమానాశ్రయంలో కార్యకలాపాలు నిలిచిపోయాయి. బెదిరింపుకు సంబంధించి విచారణ జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News