GAD: జూన్ 3న మంత్రుల చాంబర్ల స్వాధీనానికి జీఏడీ ఆదేశాలు!

GAD reportedly orders to possession of ministers chambers

  • ఏపీలో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్
  • ఏపీలో మారుతున్న పరిణామాలు
  • అమరావతి నుంచి విశాఖకు సామగ్రి తరలింపు
  • అడ్డుకున్న సీఆర్డీఏ అధికారులు
  • మంత్రుల షేషీలకు జూన్ 3న తాళాలు వేస్తామన్న జీఏడీ!

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ తేదీ (జూన్ 4) దగ్గరపడే కొద్దీ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అమరావతి నుంచి విశాఖకు సామగ్రి తరలిపోతున్నట్టు కథనాలు వస్తున్న నేపథ్యంలో సీఆర్డీఏ రంగంలోకి దిగింది. ఎల్ అండ్ టి గోడౌన్ నుంచి నిర్మాణ సామగ్రి తరలింపును సీఆర్డీఏ అధికారులు అడ్డుకున్నారు. తమ అనుమతి లేకుండా సామగ్రి తరలించవద్దని స్పష్టం చేశారు. 

అటు, జూన్ 3న సచివాలయంలోని మంత్రుల చాంబర్ల స్వాధీనానికి జీఏడీ (సాధారణ పరిపాలన శాఖ) ఆదేశాలు ఇచ్చింది. సచివాలయం నుంచి ఎలాంటి సామగ్రి బయటికి తీసుకెళ్లొద్దని స్పష్టం చేసింది. తన అనుమతి లేకుండా పత్రాలు, వస్తువులు తీసుకెళ్లొద్దని పేర్కొంది. 

మంత్రుల పేషీలు, ప్రభుత్వ శాఖల్లోని ఫైళ్లు తరలించేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది. సచివాలయం నుంచి వెళ్లే వాహనాలు తనిఖీ చేయాలని ఎస్పీఎఫ్ సిబ్బందిని ఆదేశించింది. జూన్ 3న మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News