Postal Ballot: పోస్టల్ బ్యాలెట్ నిబంధనపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ

YCP files lunch motion petition on Postal Ballot rule

  • ఏపీలో పోస్టల్ బ్యాలెట్ రగడ
  • ఆర్వో సీల్ లేకపోయినా పోస్టల్ బ్యాలెట్లు చెల్లుతాయన్న సీఈవో మీనా
  • ఈ నిబంధన సమంజసం కాదంటున్న వైసీపీ
  • ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

రిటర్నింగ్ అధికారి సీల్ (స్టాంపు) లేకపోయినా సంతకం ఉంటే చాలని, అలాంటి పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాలను ఏపీ ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు పంపించిన సంగతి తెలిసిందే. 

అయితే ఈ నిబంధనను అధికార వైసీపీ వ్యతిరేకిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ నిబంధనపై వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. 

బ్యాలెట్ పై ఆర్వో సీల్ లేకపోయినా ఓటును తిరస్కరించవద్దంటూ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా ఇచ్చిన మెమో సమంజసం కాదని వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు హైకోర్టు అంగీకారం తెలిపింది.

  • Loading...

More Telugu News