Gold Price: గణనీయంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold and silver prices slightly droped on May 29 2024
  • రూ.380 మేర తగ్గిన పసిడి ధర
  • స్వల్పంగా తగ్గిన వెండి
  • గురువారం ఉదయం ఎంసీఎక్స్‌పై తగ్గిన రేట్లు

బంగారం, వెండి ఆభరణాలు కొనాలనుకుంటున్నవారికి చిన్నపాటి గుడ్‌న్యూస్ వచ్చింది. గురువారం ధరలు గణనీయంగా తగ్గాయి. ఎంసీఎక్స్‌పై (మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్) (MCX) బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర రూ.380 మేర తగ్గి ఉదయం 8 గంటల సమయంలో రూ.72,560 వద్ద ట్రేడ్ అయ్యింది. ఇక వెండి ధర స్వల్పంగా రూ.130 మేర క్షీణించి 1 కిలో రూ.96,470కి ట్రేడ్ అయ్యింది.

కాగా వివిధ అంశాల ఆధారంగా బంగారం, వెండి ధరల్లో రోజువారీగా హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్, మారకపు రేటు హెచ్చుతగ్గులు, ప్రస్తుత వడ్డీ రేట్లు, గోల్డ్ ట్రేడింగ్‌ను నియంత్రించే ప్రభుత్వ నిబంధనలు వంటి పలు ముఖ్య అంశాల ప్రభావంతో మారుతుంటాయి.  గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులు, ఇతర కరెన్సీలతో పోలిస్తే యూఎస్ డాలర్ వంటి అంతర్జాతీయ పరిణామాలు భారతీయ మార్కెట్లో బంగారం ధరలను గణనీయంగా ప్రభావితం చేస్తుంటాయి.

నగరాల వారీగా చూస్తే న్యూఢిల్లీలో 10 బంగారం ధర రూ. 72,300, 1 కేజీ వెండి రూ.96,126గా ఉన్నాయి. ముంబైలో బంగారం రూ.72,420, వెండి రూ.96,290; చెన్నైలో పసిడి రూ.72,630, వెండి రూ.96,570; కోల్‌కతాలో బంగారం రూ.72,330, వెండి రూ.96,160; హైదరాబాద్‌లో బంగారం రూ.72,310, వెండి రూ.1.02,300గా ఉన్నాయి.

  • Loading...

More Telugu News