Atishi: ఢిల్లీలో నీటిని వృథా చేస్తే రూ.2000 జరిమానా: అధికారులకు మంత్రి ఆదేశాలు

Delhi govt imposes fine of rs 2000 for water wastage

  • దేశ రాజధానిలో నీటి సమస్యను అధిగమించేందుకు ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం
  • కార్లను కడగడం, ట్యాంకర్ల ఓవర్ ఫ్లో, వాణిజ్యపరమైన అవసరానికి వినియోగిస్తే కఠిన చర్యలు
  • ఇందుకోసం 200 బృందాలను తక్షణమే ఏర్పాటు చేయాలని మంత్రి అతిశీ ఆదేశాలు

నీటి సమస్యను అధిగమించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎండ తీవ్రత, పలుచోట్ల తాగునీటి కొరత వంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కీలక చర్యలకు ఉపక్రమించింది. నీటిని వృథా చేస్తే రూ.2000 జరిమానా విధించనున్నట్లు మంత్రి అతిశీ పేర్కొన్నారు. నీటి పైపులతో కార్లను కడగడం, వాటర్ ట్యాంకర్లు ఓవర్ ఫ్లో కావడం, వాడుక నీటిని నిర్మాణ, వాణిజ్యపరమైన అవసరాల కోసం వినియోగించడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇందుకోసం ఢిల్లీలో 200 బృందాలను తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు. రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచే ఈ బృందాలు రంగంలోకి దిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ మేరకు ఆమె జల్ బోర్డు సీఈవోకు లేఖ రాశారు. హర్యానా నుంచి ఢిల్లీకి నీరు రావాల్సి ఉందని... ఈ నీటి కోసం అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని అతిశీ నిన్న తెలిపారు.

  • Loading...

More Telugu News