Fahadh Faasil: అరుదైన వ్యాధితో బాధపడుతున్న 'పుష్ప' విలన్‌

I Am Clinically ADHD Diagnosed Reveals Fahadh Faasil

  • ఏడీహెచ్‌డీ వ్యాధి బారిన పడ్డానన్న మలయాళ నటుడు 
  • ఈ వ్యాధి ఉన్న‌వారిలో ఏకాగ్ర‌త లేక‌పోవ‌డం, హైప‌ర్ యాక్టివ్ వంటి ల‌క్ష‌ణాలు ఉంటాయ‌ని వెల్ల‌డి
  • తాను జీవితాంతం ఈ వ్యాధితో బాధపడాల్సిందేన‌న్న ఫ‌హాద్ ఫాజిల్‌

జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మలయాళ నటుడు ఫ‌హాద్ ఫాజిల్‌. హీరో అంటే 6 అడుగుల ఎత్తు.. మంచి ఫిజిక్‌ ఉండాలి.. అనే దానికి భిన్నంగా సాదా సీదా యువ‌కుడిలా ఉంటారాయ‌న‌. ఆయ‌న న‌టించిన‌ మలయాళ సినిమాలు తెలుగులోకి డబ్‌ కావడంతో.. ఇక్కడ కూడా ఫహాద్‌కి మంచి ఫాలోయింగ్ ఏర్ప‌డింది. పేరుకు మలయాళ నటుడే అయినప్పటికీ తెలుగులోనూ ఫహాద్ ఫాజిల్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 

ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో ఇక్కడి ప్రేక్ష‌కుల‌కు బాగా చేరువైపోయాడు. ఇందులో ఫ‌హాద్ పోషించిన భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర అందరికీ గుర్తుండిపోతోంది. ప్ర‌స్తుతం 'పుష్ప 2'లో న‌టిస్తున్నాడు. రెండో పార్ట్‌లోనూ ఈ పాత్రకు మరింత ప్రాధాన్యం ఉండనున్నట్లు స‌మాచారం. ఇక ఇటీవలే 'ఆవేశం' సినిమాతో మరో సూప‌ర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ ఏకంగా రూ. 100 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్ట‌డం విశేషం. ప్రస్తుతం మలయాళంలో స్టార్ యాక్టర్‌గా వెలుగొందుతున్న ప‌హాద్ ఫాజిల్ ఇటీవల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు. 

ఇటీవల ఓ పాఠశాల ప్రారంభోత్సవానికి వెళ్లిన ఫహాద్‌.. తనకు ఓ అరుదైన వ్యాధి ఉందని చెప్పి అభిమానులకు షాక్‌ ఇచ్చాడు. కేర‌ళ‌లోని ఒక చిల్డ్ర‌న్ రీ హాబిలిటేష‌న్ సెంట‌ర్ ఓపెనింగ్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ఫహాద్ తాను ఏడీహెచ్‌డీ వ్యాధి బారిన పడ్డానని తెలిపాడు. ఏడీహెచ్‌డీ అంటే అటెన్ష‌న్ డెఫిసిట్ హైప‌ర్ యాక్టివ్ డిసార్డ‌ర్. ఈ వ్యాధి ఉన్న‌వారిలో ఏకాగ్ర‌త లేక‌పోవ‌డం, హైప‌ర్ యాక్టివ్‌, హైప‌ర్ ఫోక‌స్ వంటి ల‌క్ష‌ణాలు ఉంటాయ‌న్నాడు. 

41 ఏళ్ల వయసులో ఈ అరుదైన వ్యాధి బారిన పడ్డట్లు చెప్పుకొచ్చాడు. ఇక వ్యాధికి చికిత్స విష‌య‌మై ప్ర‌శ్నించగా.. చిన్నతనంలోనే బయటప‌డితే న‌యం చేసే అవ‌కాశం ఉండేద‌న్నాడు. కానీ తనకు 41 ఏళ్ల వయసులో బయటపడిందన్నారు. ఇక తాను జీవితాంతం ఈ వ్యాధితో బాధపడాల్సిందే అని వాపోయాడు.

  • Loading...

More Telugu News