BS Yediyurappa: యెడ్యూరప్పపై లైంగిక దాడి ఆరోపణలు చేసిన మహిళ మృతి

Woman that made allegations on Yediyurappa has been died

  • తన కుమార్తెతో కలిసి యెడ్యూరప్ప వద్దకు వెళ్లానన్న మహిళ
  • తన కుమార్తెపై యెడ్యూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణ
  • గత మార్చి నెలలో యెడ్యూరప్పపై పోక్సో కేసు నమోదు
  • శ్వాస సంబంధ వ్యాధితో బాధపడుతూ మరణించిన మహిళ

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్పపై ఓ మహిళ లైంగిక దాడి ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో తన కుమార్తెపై యెడ్యూరప్ప లైంగిక అఘాయిత్యానికి పాల్పడ్డాడని సదరు మహిళ ఆరోపించింది. దాంతో యెడ్యూరప్పపై మార్చి 14న బెంగళూరు సదాశివనగర్ పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు కూడా నమోదైంది. 

అయితే, ఆయనపై ఆరోపణలు చేసిన మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. ఆ మహిళ శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతోందని, ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిందని పోలీసులు వెల్లడించారు. అయితే, ఆమె వాంగ్మూలం ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు.

More Telugu News