Chandrababu: యూపీఎస్సీకి లేఖ రాసిన చంద్రబాబు... ఎందుకంటే...!

Chandrababu wrote UPSC to postpone IAS Confirmation in AP

  • ఏపీలో ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియ
  • ఇప్పుడు కన్ఫర్మేషన్ చేపట్టడం ఎన్నికల కోడ్ కు విరుద్ధమన్న చంద్రబాబు
  • సీఎంవోలో ఉన్నవారికే పదోన్నతులు పరిమతం చేశారని ఆరోపణ
  • కొత్త ప్రభుత్వం వచ్చేవరకు కన్ఫర్మేషన్ వాయిదా వేయాలని యూపీఎస్సీకి విజ్ఞప్తి

టీడీపీ అధినేత చంద్రబాబు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)కి లేఖ రాశారు. ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు. 

ఇప్పుడు కన్ఫర్మేషన్ ప్రక్రియ చేపట్టడం ఎన్నికల నియమావళికి విరుద్ధం అని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ఇంకా ముగియనందున ఇప్పుడు కన్ఫర్మేషన్ ప్రక్రియ సరికాదని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. 

సీఎంవోలో ఉన్నవారికే పదోన్నతులు పరిమితం చేశారని ఆరోపించారు. కన్ఫర్మేషన్ జాబితా తయారీలో పారదర్శకత లేదని విమర్శించారు. ఐఏఎస్ కన్ఫర్మేషన్ జాబితాను పునఃపరిశీలించాలని చంద్రబాబు యూపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు కన్ఫర్మేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు.

  • Loading...

More Telugu News