Hema: బెంగళూరు రేవ్ పార్టీ కేసు: టాలీవుడ్ నటి రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు

Police said drugs positive for Tollywood actress
  • ఇటీవల బెంగళూరులో రేవ్ పార్టీ
  • పట్టుబడిన వారిలో నటి హేమ
  • పట్టుబడిన వారి నుంచి రక్త నమూనాలు సేకరించిన పోలీసులు
  • 103 మందికి డ్రగ్స్ పాజిటివ్
కొన్ని రోజుల కిందట బెంగళూరు నగర శివార్లలో ఓ ఫాంహౌస్ లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేయడం తెలిసిందే. ఓ వ్యాపారవేత్త ఏర్పాటు చేసిన ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న పలువురు తెలుగు సినీ నటులు, టీవీ నటులు, మోడల్స్ పట్టుబడ్డారు. ఇందులో 150 మంది నుంచి పోలీసులు రక్త నమూనాలు సేకరించి నార్కోటిక్స్ ల్యాబ్ కు పంపగా, అందులో 103 మందికి డ్రగ్స్ పాజిటివ్ అని వెల్లడైంది. రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నవారిలో ఒక టాలీవుడ్ నటి కూడా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. 

బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ కూడా ఉన్నట్టు పోలీసులు ఇటీవల ఓ ఫొటో కూడా విడుదల చేశారు. అంతకుముందు, ఆమె తాను బెంగళూరులో లేనని, హైదరాబాదులోని ఓ ఫాంహౌస్ లో చిల్ అవుతున్నానని వీడియో విడుదల చేసింది. అయితే, ఆ వీడియోలో హేమ ధరించిన డ్రెస్సుతోనే ఉన్న ఫొటోను పోలీసులు విడుదల చేయడంతో ఆమె బుకాయిస్తోందన్న విషయం బట్టబయలైంది.
Hema
Drugs Positive
Rave Party
Police
Bengaluru
Tollywood

More Telugu News