Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లీ... నువ్వు ప్రజా ప్రతినిధివా, లేక వీధి రౌడీవా?: జూలకంటి బ్రహ్మారెడ్డి

Julakanti Brahma Reddy fires on MLA Pinnelli

  • పోలింగ్ వేళ ఈవీఎంను పగులగొట్టిన పిన్నెల్లి
  • సామాజిక మాధ్యమాల్లో వీడియోల కలకలం
  • పిన్నెల్లికి ఓటమి భయం పట్టుకుందన్న జూలకంటి

పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేట్ వద్ద ఓ పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియోలు కలకలం రేపుతున్నాయి. దీనిపై మాచర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. 

పిన్నెల్లీ... నువ్వు ప్రజాప్రతినిధివా, లేక వీధి రౌడీవా? అని నిలదీశారు. "బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ బూత్ లోకి చొరబడి అధికారుల ముందే అడ్డగోలుగా రౌడీ మాదిరి ఈవీఎంను పగులగొడుతున్నావు అంటే నీ ఓటమి తాలూకు భయం నీ నరనరాన జీర్ణించుకుపోయిందని అర్థమైంది. 

వ్యవస్థల పట్ల ఏ మాత్రం భయం, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావు అంటే ఈ పోలీసు, న్యాయవ్యవస్థలు ఏమీ చేయలేవు అనే భరోసా కావొచ్చు. కానీ రేపు ప్రజాకోర్టులో ఇచ్చే తీర్పు నుండి మాత్రం తప్పించుకోలేవు. 

నువ్వు ప్రతి రోజూ సత్యహరిశ్చంద్రుడి కజిన్ బ్రదర్ లా పోజులు కొడుతూ చెప్పే మాటలు అన్నీ అసత్యాలు అని ప్రజలు ఏనాడో తెలుసుకున్నారు" అంటూ జూలకంటి బ్రహ్మారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు పిన్నెల్లి ఈవీఎంను పగులగొడుతున్న వీడియోను కూడా పంచుకున్నారు.

More Telugu News