Jupally Krishna Rao: తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు అంటూ వార్తలు... అలాంటిదేమీ లేదన్న మంత్రి జూపల్లి

Jupally condemns a media story that a new liquor policy will roll out in state

  • పొరుగు రాష్ట్రం తరహాలో తెలంగాణలో కొత్త బ్రాండ్లు అంటూ ఓ పత్రికలో కథనం
  • ప్రభుత్వ పెద్దలు అనధికార పాలసీ రూపొందిస్తున్నారని వివరణ
  • ఖండించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
  • పత్రికపై పరువునష్టం దావా వేస్తామని హెచ్చరిక

తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన, పక్క రాష్ట్రంలో మాదిరిగా, తెలంగాణలోనూ కొత్త మద్యం బ్రాండ్లు వస్తున్నాయంటూ ఓ పత్రికలో వచ్చిన కథనంపై స్పందించారు. 

కొత్త మద్యం బ్రాండ్ల కోసం కొందరు ప్రభుత్వ పెద్దలు అనధికారిక పాలసీ రూపొందిస్తున్నట్టు వస్తున్న వార్తలు అర్థరహితం అన్నారు. కొత్త మద్యం బ్రాండ్లు తీసుకువచ్చి, వాటిపై భారీగా కమీషన్లు పొందాలన్నదే ఆ పెద్దల ఆలోచన అంటూ వచ్చిన ఆ కథనంలో నిజం లేదని మంత్రి జూపల్లి ఖండించారు. 

అసలు ఈ విధానమే లేనప్పుడు కొత్త మద్యం బ్రాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవడం, మేం పరిశీలించడం ఎలా సాధ్యమవుతుంది? అని జూపల్లి ప్రశ్నించారు. అంతేకాదు, అసత్య కథనం ప్రచురించిన ఆ పత్రికపై రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News