Restless Leg Syndrome: కుర్చీలో కూర్చుని అదే పనిగా కాళ్లూపుతున్నారా? మీకీ సమస్య ఉన్నట్టే!

How to Identify and Treat Restless Leg Syndrome
  • తమకు తెలియకుండానే కొందరు కాళ్లూపుతుంటారు
  • చివరికి పెద్దల ముందు కూడా అదే పనిగా కాళ్లాడిస్తుంటారు
  • కాళ్లు ఇలా ఊపడాన్ని రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ అంటారు
  • మందుల్లేవు కానీ నివారణ మార్గాలున్నాయంటున్న నిపుణులు
చాలామందికి ఓ అలవాటు ఉంటుంది. ఎక్కడ కూర్చొన్నా కాళ్లను అదే పనిగా ఊపుతుంటారు. కుర్చీ, సోఫా, పిట్టగోడ.. ఇలా ఎక్కడ కూర్చొన్నా వారు ఆ అలవాటును మానుకోలేరు. చివరికి ఆఫీసులోను, పెద్దవాళ్ల ముందు కూడా తమకు తెలియకుండానే కాళ్లు ఊపుతుంటారు. ఎంత నియంత్రించుకున్నా వారివల్ల కాకుండా ఉంటుంది. 

నిజానికి ఇది అలవాటని చాలామంది అనుకుంటారు. కానీ, అది అలవాటు కాదు.. ఆరోగ్యంలో లోపమే అందుకు కారణమని వైద్య నిపుణులు తేల్చారు. దీనిని రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ (ఆర్ఎల్ఎస్) అని అంటారు. ఈ సిండ్రోమ్ బారిన పడేదెవరు? ఎందుకు ఇది కొందరిలోనే కనిపిస్తుంది? దీనికి నివారణ మార్గాలేంటి? అన్న విషయాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను వీక్షించండి.

Restless Leg Syndrome
RSL
Health
Health News
AP7AM Videos

More Telugu News