Telangana: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియాగాంధీని ఆహ్వానించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం

TG cabinet to invite Sonia Gandhi on June 2
  • దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చ
  • ధాన్యం కొనుగోలు బాధ్యతను కలెక్టర్లకు అప్పగిస్తూ నిర్ణయం
  • సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం
జూన్ 2న నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఆహ్వానించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. సోమవారం మధ్యాహ్నం ఈసీ షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన అనంతరం సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్ర అవతరణ వేడుకలు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై చర్చించారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.

ధాన్యం కొనుగోళ్లపై కూడా కేబినెట్లో చర్చించారు. ఈ బాధ్యత పూర్తిగా ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చివరి గింజ వరకు కొనాలని ఆదేశాలు జారీ చేసింది. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని కేబినెట్ తీర్మానం చేసింది.
Telangana
Telangana Cabinet
Revanth Reddy

More Telugu News