Ebrahim Raisi: దేశాధ్యక్షుడు రైసీ మృతితో సంబరాలు చేసుకున్న ఇరానియన్లు
- హెలికాప్టర్ కూలిన ఘటనలో రైసీ దుర్మరణం
- రైసీ చాలా క్రూరంగా వ్యవహరించారనే ఆరోపణలు
- ఇస్లామిక్ ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చిన రైసీ
హెలికాప్టర్ క్రాష్ అయిన ఘటనలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో ఇరానియన్లు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. టెహ్రాన్, మషాద్ లోని ప్రధాన కూడళ్లలో వందలాది మంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. విదేశాల్లో ఉన్న ఇరానియన్లు కూడా సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇరాన్ అధ్యక్షుడిగా రైసీ ఎన్నికైన తర్వాత చాలా క్రూరంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో చిక్కిన ఖైదీలకు ఉరి వేయించాడని... ఆయన నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గళం విప్పిన వారిని కూడా కఠినంగా శిక్షించాడని చెపుతున్నారు. ఇస్లామిక్ ఆచారాలకు రైసీ ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై ప్రజల్లో ఎంతో వ్యతిరేకత ఉంది. ఆయన మృతిని ప్రజలు సెలెబ్రేట్ చేసుకుంటున్నారని స్థానిక మీడియా తెలిపింది.