Bharateeyudu 2: జూన్ 1న చెన్నైలో గ్రాండ్ గా భారతీయుడు-2 ఆడియో లాంచ్

Bharateeyudu2 audio launch will be held on June 1

  • కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ రిపీట్
  • గతంలో వచ్చిన భారతీయుడు బ్లాక్ బస్టర్ హిట్
  • సీక్వెల్ గా వస్తున్న భారతీయుడు-2
  • జులైలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న భారీ చిత్రం

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘ భార‌తీయుడు 2’. 

కమల్, శంకర్ కాంబినేష‌న్‌లో 1996లో విడుద‌లై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సరికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసిన ‘భార‌తీయుడు’ మూవీకి సీక్వెల్‌గా ఇప్పుడు ‘ భార‌తీయుడు 2’ రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా జులైలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

 కాగా, ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకను జూన్ 1న చెన్నైలో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ సినిమా శ‌ర‌వేగంగా రూపొందుతోంది. జులైలో సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా, ముంబైలోని స్టార్ స్పోర్ట్స్ ఛానల్ స్టూడియోలో ‘భారతీయుడు 2’ ప్రమోషన్స్ ను వినూత్నంగా ప్రారంభించటం విశేషం. 

క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్‌, ఎస్‌.జె.సూర్య‌, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్ధార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, నెడుముడి వేణు, వివేక్‌, కాళిదాస్ జ‌య‌రాం, గుల్ష‌న్ గ్రోవ‌ర్‌, స‌ముద్ర‌ఖ‌ని, బాబీ సింహ‌, బ్ర‌హ్మానందం, జాకీర్ హుస్సేన్‌, పియుష్ మిశ్రా, గురు సోమ‌సుంద‌రం, ఢిల్లీ గ‌ణేశ్, జ‌య‌ప్రకాశ్ , మ‌నోబాల‌, అశ్వినీ తంగ‌రాజ్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ర‌వివ‌ర్మ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Star Sports Tamil (@starsportstamil)

More Telugu News