Kalyana Lakshmi: మరో హామీని నిలబెట్టుకున్న రేవంత్ సర్కార్.. ఇకపై వివాహం చేసుకునే పేద జంటలకు తులం బంగారం కూడా!

Revanth Reddy govt release 725 cr funds for Kalyana Lakshmi and Shaadi Mubarak

  • కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు రూ. 725 కోట్ల నిధులు విడుదల
  • నవ దంపతులకు రూ.1,00,116తోపాటు తులం బంగారం ఇవ్వనున్న ప్రభుత్వం
  • నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మరో హామీని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిలబెట్టుకుంది. తాము అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా నవ దంపతులకు ప్రభుత్వం ఇస్తున్న రూ. 1,00,116కు తులం బంగారం జోడించి ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు దీనిని అమల్లోకి తీసుకొచ్చింది. 

అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పథకంలో రూ. 5 లక్షలుగా ఉన్న పరిమితిని రూ. 10 లక్షలకు పెంచిన ప్రభుత్వం.. తాజాగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది.

2024-25 బడ్జెట్‌లో ఇందుకోసం కేటాయించిన రూ.725 కోట్ల నిధుల విడుదలకు అనుమతి లభించింది. ఈమేరకు శనివారం ప్రిన్సిపల్ సెక్రటరీ బి. వెంకటేశం ఉత్తర్వులు జారీచేశారు. వివాహ బంధంతో ఒక్కటయ్యే ఆలోచనలో ఉన్న పేద జంటలు ప్రభుత్వ నిర్ణయంపై సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

  • Loading...

More Telugu News