SIT: డీజీపీ ఆఫీసులో సిట్ అధికారులను కలిసిన టీడీపీ నేతలు... పెన్ డ్రైవ్ లో ఆధారాల అందజేత

TDP leaders met SIT officers at DGP Office

  • ఏపీలో పోలింగ్ రోజు నుంచి కొనసాగిన హింస
  • ఈసీ ఆదేశాలతో సిట్ నియామకం
  • సిట్ దర్యాప్తు పారదర్శకంగా ఉండాలన్న టీడీపీ నేతలు
  • చాలారోజుల తర్వాత స్వేచ్ఛగా డీజీపీ కార్యాలయానికి వచ్చామన్న వర్ల రామయ్య

ఏపీలో పోలింగ్ రోజు నుంచి కొనసాగిన అల్లర్లు, హింసపై ఈసీ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను నియమించిన సంగతి తెలిసిందే. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో జరిగిన ఘటనలపై సిట్ దర్యాప్తు ప్రారంభమైన నేపథ్యంలో... టీడీపీ నేతలు నేడు డీజీపీ కార్యాలయంలో సిట్ అధికారులను కలిశారు. 

పోలింగ్ అనంతర దాడుల వివరాలను ఓ పెన్ డ్రైవ్ లో ఉంచి సిట్ అధికారులకు అందించారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా పారదర్శకంగా దర్యాప్తు జరపాలని సిట్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. 

దీనిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య స్పందిస్తూ, తిరుపతి, అనంతపురం, పల్నాడు జిల్లాల్లో ఘటనలపై సిట్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు. మొత్తం 30 ఘటనల వివరాలను సిట్ కు అందించామని వెల్లడించారు. చాలాకాలం తర్వాత స్వేచ్ఛగా డీజీపీ కార్యాలయానికి రాగలిగామని అన్నారు.

  • Loading...

More Telugu News