Ch Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖరరెడ్డిపై కేసు

Case filed against former minister Mallareddy

  • పేట్ బషీరాబాద్‌లో రెండున్నర ఎకరాల స్థలం వివాదంలో కేసు
  • ఫెన్సింగ్ కూలగొట్టి దౌర్జన్యం చేశారని బాధితుల ఫిర్యాదు
  • మల్లారెడ్డికి మద్దతుగా వెళ్లిన అనుచరులపై కూడా కేసు

మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కేసు నమోదైంది. పేట్ బషీరాబాద్‌లో రెండున్నర ఎకరాల స్థలం వివాదంలో మల్లారెడ్డిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

స్థలం వివాదంలో జోక్యం చేసుకోవడంతో పాటు, ల్యాండ్‌లో ఫెన్సింగ్ కూలగొట్టి దౌర్జన్యం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మామాఅల్లుళ్లకు మద్దతుగా వెళ్లిన పలువురు అనుచరులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

Ch Malla Reddy
BRS
Medchal Malkajgiri District
Hyderabad
  • Loading...

More Telugu News