Palnadu District: పల్నాడు జిల్లాకు కొత్త కలెక్టర్ ను నియమించిన ఎన్నికల సంఘం

EC appoints new collector for Palnadu district
  • ఏపీలో పోలింగ్ సందర్భంగా, ఆ తర్వాత హింస
  • పల్నాడు కలెక్టర్ ను, తిరుపతి ఎస్పీని బదిలీ చేసిన ఈసీ
  • అనంతపురం, పల్నాడు ఎస్పీలపై సస్పెన్షన్ వేటు
  • పల్నాడు నూతన కలెక్టర్ గా శ్రీకేశ్ బాలాజీ లట్కర్ నియామకం
  • కాసేపట్లో తిరుపతి, పల్నాడు, అనంతపురం జిల్లాలకు కొత్త ఎస్పీల నియామకం 
పల్నాడు జిల్లాలో పోలింగ్ సందర్భంగా, ఆ తర్వాత అల్లర్లు జరిగిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ను, తిరుపతి ఎస్పీని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో, పల్నాడు జిల్లాకు కొత్త కలెక్టర్ ను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లాకు శ్రీకేశ్ బాలాజీ లట్కర్ ను కలెక్టర్ గా నియమిస్తున్నట్టు పేర్కొంది. ఈసీ ఈ సాయంత్రం లోగా తిరుపతి, పల్నాడు, అనంతపురం జిల్లాలకు కొత్త ఎస్పీలను కూడా ప్రకటించనుంది. సీఎస్ పంపిన పేర్లను పరిశీలిస్తున్న ఈసీ కాసేపట్లో ఉత్తర్వులు వెలువరించనుంది.
Palnadu District
Latkar Srikesh Balaji
District Collector
EC
Andhra Pradesh

More Telugu News