AP Elecions 2024: తిరుపతిలో విచారణ ప్రారంభించిన సిట్‌ బృందం

SIT Investigation in Tirupati

  • ఏపీలో హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌పై విచార‌ణ కోసం ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో 13 మంది సభ్యులతో 'సిట్‌'
  • పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారించి నివేదిక ఇవ్వాలన్న డీజీపీ
  • ఈ నేపథ్యంలో శనివారం ఉదయం తిరుపతికి చేరుకున్న సిట్‌ బృందం

ఏపీలో పోలింగ్‌ త‌ర్వాత చోటు చేసుకున్న హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌పై విచార‌ణ కోసం ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని శుక్రవారం నియమించిన విష‌యం తెలిసిందే. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారించి నివేదిక ఇవ్వాలని డీజీపీ ఈ బృందాన్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సిట్‌ బృందం శనివారం ఉదయం తిరుపతికి చేరుకుంది. 

తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీలో సిట్‌ అధికారులు విచారణ చేపట్టారు. హింసాత్మక ఘటనలపై నమోదైన కేసుల వివరాలను స్థానిక పోలీసు అధికారుల నుంచి సేకరించారు. కొన్ని కేసుల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను సిట్‌ మళ్లీ పరిశీలించనుంది. అల్లర్లపై ప్రాథమిక నివేదికను ఈసీకి పంపనుంది. 

పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లపై నివేదిక ఇవ్వనుంది. అల్లర్లతో సంబంధం ఉన్న కొందరు రాజకీయ పార్టీ నేతలను సిట్‌ అరెస్టు చేసే అవకాశం కూడా ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపైనా ఈసీ చర్యలు తీసుకోనున్నట్లు స‌మాచారం.

AP Elecions 2024
SIT
Tiurpati
Andhra Pradesh
AP Politics
  • Loading...

More Telugu News