Stock Market: స్టాక్ మార్కెట్లకు ఈరోజు కూడా లాభాలే

Markets ends this week in profits

  • 253 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 62 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • రూపాయితో డాలరు మారకం విలువ రూ. 83.34

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే, ఆ తర్వాత కీలక రంగాల్లో కొనుగోళ్ల అండతో కోలుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 253 పాయింట్లు లాభపడి 73,917కి చేరుకుంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22,466 వద్ద స్థిరపడింది. అమెరికా డాలరుతో పోలిస్తే మన రూపాయి మారకం విలువ రూ. 83.34గా ఉంది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (5.97%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (2.36%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.85%), కోటక్ బ్యాంక్ (1.50%), ఐటీసీ (1.24%). 

టాప్ లూజర్స్:
టీసీఎస్ (-1.70%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.11%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.00%), నెస్లే ఇండియా (-0.85%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.73%).

  • Loading...

More Telugu News