Forbes: 30 ఏళ్లలోపు వయసులోనే ఫోర్బ్స్ ఆసియా-30 జాబితాకెక్కిన మనవాళ్లు... వివరాలు ఇవిగో!

Forbes 30 Under 30 Asia list

  • సత్తా చాటుతున్న భారత యువతరం
  • భారతీయుల ప్రతిభను గుర్తించిన ఫోర్బ్స్
  • తాజాగా 30 అండర్ 30 ఆసియా పేరిట జాబితా విడుదల

ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఓ ఆసక్తికర జాబితా విడుదల చేసింది. 30 ఏళ్ల లోపు వయసుకే ఆసియా లెవల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ పారిశ్రామికవేత్తలు, నాయకులు, కళాకారులతో కూడిన టాప్-30 జాబితాను రూపొందించింది. ఇందులో పవిత్రా చారి, అర్పణ్ కుమార్ చందేల్ వంటి కొత్త తరం గాయకులు, కుశ్ జైన్, అర్థ్ చౌదరి, దేవ్యాంత్ భరద్వాజ్, ఓషీ కుమారి, ప్రణవ్ మన్ పురియా ఇంటి టెక్నో ఆంట్రప్రెన్యూర్లు, కునాల్ అగర్వాల్, ఆదిత్య దడియా వంటి ఎంటర్ ప్రైజ్ స్టార్టప్ ల నిర్వాహకులు ఉన్నారు.

కన్స్యూమర్ టెక్నాలజీ విభాగం...
1. ఓషీ కుమారి, దేవ్యాంత్ భరద్వాజ్, అర్థ్ చౌదరి 

ఇన్ సైడ్ ఎఫ్ పీవీ అనే డ్రోన్ స్టార్టప్ స్థాపకులు... ప్లగ్ అండ్ ఫ్లై తరహాలో సులభంగా వినియోగించదగ్గ రీతిలో డ్రోన్లకు రూపకల్పన చేశారు.
2. జార్జ్ ఫ్రాన్సిస్
జార్జ్ ఫ్రాన్సిస్ కన్జూమెక్స్ ఇండస్ట్రీస్ లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. ఈ కంపెనీ తయారుచేసిన స్మార్ట్ రింగ్ వేలికి ధరించవచ్చు. దీని బరువు ఐదు గ్రాములు. ఎంతో అధునాతన రీతిలో ఈ రింగ్ ద్వారా హెల్త్ మానిటరింగ్ చేయొచ్చు.
3. ఖుషి జైన్
ఓరామా ఏఐ సంస్థ సహ వ్యవస్థాపకురాలు. ఈ సంస్థ అంధులు బ్రెయిలీ లిపి నేర్చుకునేందుకు ఉపకరించే ఒక స్మార్ట్ గ్లోవ్ ను తయారుచేసింది.
4. హర్షిత్ జైన్, అభిషేక్ సాహా
వీరిద్దరూ కలిసి ఒన్ ప్లే అనే క్లౌడ్ గేమింగ్ స్టార్టప్ ను ముంబయిలో ప్రారంభించారు. అత్యంత ఖరీదైన గేమింగ్ పరికరాలతో పనిలేకుండానే ఒకేసారి ఎక్కువ వేదికలపై పాప్యులర్ వీడియో గేమ్స్ ఆడుకునే సౌలభ్యాన్ని ఈ గేమింగ్ స్టార్టప్ కల్పిస్తుంది.

పరిశ్రమలు, తయారీ రంగం, శక్తి ఉత్పాదన
1. అక్షిత్ బన్సాల్, రాఘవ్ అరోరా
వీరు స్థాపించిన స్టాటిక్ అనే సంస్థ దేశవ్యాప్తంగా విద్యుత్ వాహనాల కోసం చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. స్టాటిక్ సంస్థకు చెందిన చార్జింగ్ పాయింట్ల వద్ద రాపిడ్ చార్జింగ్ సదుపాయాలు ఉండడం విశేషం. అంతేకాదు కేవలం 15 నిమిషాల్లో మీ పాత బ్యాటరీని ఫిల్లింగ్ చేస్తారు.
2. గౌతమ్ మహేశ్వరన్, అరుణ్ శ్రేయాస్
వీరు హైదరాబాద్ లో రేస్ ఎనర్జీ అనే సంస్థను స్థాపించారు. ఆటో రిక్షాల్లో సులభంగా రీప్లేస్ చేయగలిగే బ్యాటరీలను రూపొందించారు.

ఆర్థిక, వ్యవస్థీకృత పెట్టుబడుల రంగం
1. అంకిత్ దామ్లే
బ్లాక్ స్టోన్ సంస్థలో ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్ మెంట్ బృందంలో కీలక సభ్యుడు. ఆటోమొబైల్, కన్స్యూమర్, పారిశ్రామిక రంగాల్లో వ్యూహాత్మక పెట్టుబడులను పర్యవేక్షించే నిపుణుడు. 
2. యశు అగర్వాల్
వెబ్ ఆధారిత చెల్లింపుల వేదిక ట్రాన్సాక్ సహ వ్యవస్థాపకుడు. క్రిప్టోకరెన్సీలు, ఎన్ఎఫ్ టీ (నాన్ ఫంజిబుల్ టోకెన్స్)ల అమ్మకం, కొనుగోలును సులభతరం చేసేందుకు ఈ వేదిక ఉపకరిస్తుంది.
3. శ్రీనివాస సర్కార్, కుశాగ్ర మాంగ్లిక్
వీరు కపుల్ అనే ఫైనాన్షియల్ టెక్నాలజీ స్టార్టప్ ను స్థాపించారు. కపుల్... పేరుకు తగ్గట్టుగానే జంటలకు చెందిన ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దడంలో సాయపడుతుంది. పెళ్లయిన జంటా, లేకపోతే స్వలింగ సంపర్కులా అనేది ఇక్కట పట్టించుకోరు. జంట అయితే చాలు.

వినోద రంగం..
1. పవిత్ర చారి
పవిత్ర చారి ఒక ప్రొఫెషనల్ గాయని. 2023లో గ్రామీ అవార్డుకు కూడా నామినేట్ అయ్యారు. అనిందో బోస్, అనిరుధ్ వర్మలతో కలిసి ప్రపంచవ్యాప్త సంగీత కచేరీల్లో పాల్గొన్నారు. పవిత్ర చారి భరతనాట్యంలోనూ దిట్ట. అనేక సినీ గీతాలకు కవర్ సాంగ్స్ కూడా చేశారు.
2. అర్పణ్ కుమార్ చందేల్ (కింగ్)
అర్పణ్ కుమార్ ఇక భారతీయ ర్యాప్ గాయకుడు. కింగ్ పేరుతో చాలా పాప్యులారిటీ సంపాదించుకున్నాడు. ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ అంతటివాడు అర్పణ్ కుమార్ పాటను రీమిక్స్ చేయడంతో మనవాడి పేరు అంతర్జాతీయంగా వినిపించింది. ఇప్పటివరకు అనేక ర్యాప్ ఆల్బంలను విడుదల చేసిన అర్పణ్ కుమార్ తాజాగా నికితా గాంధీ, గుస్సీ మానే వంటి ఇతర కళాకారులతో కలిసి న్యూ లైఫ్ అనే ఆల్బం తీసుకువచ్చాడు.

వీళ్లే కాకుండా... కన్స్యూమర్ టెక్నాలజీ రంగంలో కుష్ జైన్, అర్థ్ చౌదరి, దేవ్యాంత్ భరద్వాజ్, ప్రణవ్ మన్ పురియా....
ఎంటర్ ప్రైజ్ టెక్నాలజీ రంగంలో కునాల్ అగర్వాల్, గౌరవ్ పియూష్, మయాంక్ వర్షిణి, యశ్ శర్మ, ఆదిత్య దడియా...
ఆర్థిక, వ్యవస్థీకృత పెట్టుబడుల రంగంలో ఆలేష్ అవ్లానీ, అనికేత్ దామ్లే, యశోవర్ధన్ కనోయ్, మనీశ్ మర్యాదా, అనుజ్ శ్రీవాస్తవ, ప్రియేశ్ శ్రీవాస్తవ...
ఆరోగ్య పరిరక్షణ, సైన్స్ రంగంలో కరణ్ అహూజా, ఆర్యన్ చౌహాన్...
పరిశ్రమలు, తయారీ రంగం, శక్తి ఉత్పాదన రంగంలో అంకిత్ జైన్, నారాయణ్ లాల్ గుజ్జర్, చిరాగ్ జైన్, రామకృష్ణ మెండు, రాహిల్ గుప్తా...
మీడియా, మార్కెటింగ్, అడ్వర్టయిజింగ్ రంగంలో కవన్ అంతానీ... ఫోర్బ్స్ ఆసియా30 జాబితాలో చోటు దక్కించుకున్నారు.

  • Loading...

More Telugu News