Tihar Jail: తీహార్ జైల్లో కల్వకుంట్ల కవితను కలిసిన బాల్క సుమన్, ఆర్​ ఎస్​ ప్రవీణ్​ కుమార్

brs leaders meet kavitha in delhi tihar jail

  • ములాఖత్ లో పరామర్శించిన బాల్క సుమన్, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
  • కుటుంబ సభ్యులు కాకుండా పార్టీ నేతలు ఆమెను కలవడం ఇదే తొలిసారి
  • ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమెను మార్చి 15న అరెస్ట్ చేసిన ఈడీ

ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆ పార్టీ నేతలు శుక్రవారం కలిశారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌, నాగర్‌ కర్నూలు బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆమెను పరామర్శించారు. 

కుటుంబ సభ్యులు కాకుండా పార్టీ నేతలు ఆమెతో ములాఖత్‌ కావడం ఇదే తొలిసారి. దీంతో ఈ పరామర్శ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఢిల్లీ నూతన లిక్కర్ పాలసీ తయారీ కుంభకోణంలో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై ఈడీ మార్చి 15న కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో అరెస్టు చేయడం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె జ్యుడీషియల్ రిమాండ్‌ లోనే ఉన్నారు. 

ఇదే కేసులో సీబీఐ సైతం ఆమెను సాంకేతికంగా అరెస్టు చేసినట్లు చూపింది. మరోవైపు బెయిల్‌ కోసం కవిత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ ట్రయల్ కోర్టు కొట్టేసింది.

 బెయిల్ పై విడుదల చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న ఈడీ, సీబీఐ వాదనతో కోర్టు ఏకీభవించింది. దీంతో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని వేర్వేరుగా పిటిషన్లు వేశారు. ప్రస్తుతం వాటిపై విచారణ జరుగుతోంది. 

  • Loading...

More Telugu News