TV Anchor Rape: టీవీ యాంకర్ కు తీర్థంలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చి అత్యాచారం చేసిన పూజారి

Pujari raped TV anchor in Chennai

  • చెన్నైలో ఓ టీవీ ఛానల్ లో యాంకర్ గా పని చేస్తున్న బాధితురాలు
  • పూజారి కారణంగా గర్భం దాల్చిన వైనం
  • వ్యభిచారం చేయాలని యాంకర్ పై ఒత్తిడి

నిరంతరం దైవ సేవలో ఉంటూ భగవంతుడికి, భక్తుడికి అనుసంధానకర్తగా ఉండాల్సిన ఒక పూజారి ఆలోచనలు వక్రమార్గం పట్టాయి. ఒక టీవీ ఛానల్ యాంకర్ (30 ఏళ్లు) కు తీర్థంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. ఈ నీచానికి ఒడిగట్టిన పూజరి పేరు కార్తీక్ మునిస్వామి. చెన్నైలోని ప్రధాన అమ్మన్ ఆలయాల్లో ఒక ఆలయంలో పూజారిగా ఉన్నాడు. తనపై జరిగిన దారుణంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

అత్యాచారానికి గురైన యాంకర్ చెన్నైలోని సాలిగ్రామం ప్రాంతంలో ఉంటుంది. తాను ఆధ్యాత్మిక వ్యక్తినని, తరచుగా ఆలయాలను సందర్శిస్తుంటానని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. చెన్నైలోని పర్యాస్ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ కాళికంపాల్ ఆలయానికి తరచుగా వెళ్తుంటానని... ఈ క్రమంలో తనకు ఆలయ పూజారి కార్తీక్ మునిస్వామితో పరిచయం ఏర్పడిందని తెలిపింది. ఈ స్నేహంతో తాను గుడికి వచ్చినప్పుడల్లా గర్భగుడిలోకి తీసుకెళ్లి ప్రత్యేక దర్శనం చేయించేవాడని చెప్పింది. 

ఈ క్రమంలో తమకు స్నేహం పెరిగిందని... ఒకరోజు తాను గుడికి వచ్చినప్పుడు తన బెంజ్ కారులో డ్రాప్ చేస్తానని చెప్పాడని... కారులో ప్రయాణిస్తుండగా తీర్థం ఇచ్చాడని, దీన్ని తాగిన తర్వాత తనకు స్పృహ తప్పిందని ఆమె తెలిపింది. ఆ తర్వాత తనపై అత్యాచారం చేశాడని చెప్పింది. ఇది జరిగిన తర్వాత తనను గుడిలోనే పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని... ఆ తర్వాత చాలా సార్లు తమ ఇంటికి వచ్చాడని, తాను గర్భవతిని అయ్యానని తెలిపింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అబార్షన్ చేయించాడని... ఆ తర్వాత తనను వ్యభిచారం చేయమని బలవంతం చేశాడని పేర్కొంది. 

ఆమె ఫిర్యాదుతో పూజారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో సన్నిహితంగా ఉన్న కొన్ని ఫొటోలు, వీడియోలను అతని ఫోన్ నుంచి పోలీసులు రికవరీ చేశారు. ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన బాధితురాలు చెన్నైకి చెందిన ఓ టీవీ ఛానల్ లో పని చేస్తోంది.

  • Loading...

More Telugu News