CCMB: పురుషుల సంతానలేమికి తల్లి లోపభూయిష్ట జన్యువు కారణం!

Faulty gene from mother can be behind sons infertility says new study

  • పురుషుల్లో సంతానలేమిపై సీసీఎమ్‌బీ (హైదరాబాద్) అధ్యయనం 
  • తల్లి నుంచి సంక్రమించే లోపభూయిష్ట జన్యువుతో శుక్రకణాల్లో లోపాలు 
  • ఎక్స్ క్రోమోజోమ్‌లోని టీఈఎక్స్13బీతో శుక్రకణాల్లో సమస్యలు వస్తున్నట్టు గుర్తింపు

పురుషుల సంతాన లేమికి తల్లి నుంచి సంక్రమించే లోపభూయిష్ట జన్యువు కారణమని తొలిసారిగా సీసీఎమ్‌బీ అధ్యయనంలో తేలింది. ఎక్స్ క్రోమోజోమ్‌లో ఈ జన్యువు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. హైదరాబాద్‌లోని సీసీఎమ్‌బీ, ఇతర పరిశోధన సంస్థలకు చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. దీనికి సంబంధించిన వివరాలను సీసీఎమ్‌బీ గురువారం వెల్లడించింది. 

సీసీఎమ్‌బీ పరిశోధకుల ప్రకారం, ప్రపంచంలోని ప్రతి ఏడు జంటల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారు. పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉండటం, శుక్రకణాల, సైజు, నిర్మాణం కదలికల్లో లోపాలు కారణంగానే సగం సందర్భాల్లో పురుషుల్లో సంతానలేమి తలెత్తుతోంది. అయితే, పురుషులకు వారి తల్లుల నుంచి ఎక్స్ క్రోమోజోమ్ ద్వారా సంక్రమించే జన్యులోపమే ఈ పరిస్థితికి కారణమని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. 

అత్యాధునిక జన్యుక్రమ విశ్లేషణ పద్ధతులతో శాస్త్రవేత్తలు సంతానలేమితో బాధపడుతున్న పురుషులు, ఆరోగ్యవంతుల జన్యువులను విశ్లేషించారు. ఈ క్రమంలో సంతానలేమితో బాధపడుతున్న పురుషుల్లోని ఎక్స్ క్రోమోజోమ్‌లో టీఈఎక్స్13బీ అనే లోపభూయిష్ట జన్యువును గుర్తించారు. మరో జన్యువు కూడా వీరిలో అధికంగా ఉన్నట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News