Chandrababu: షిరిడీ సాయిని దర్శించుకున్న చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు... ఫొటోలు ఇవిగో!
![Chandrababu and Nara Bhuvaneswari visits Shiridi Sai mandir](https://imgd.ap7am.com/thumbnail/cr-20240516tn664622b26e612.jpg)
- మహారాష్ట్రలో చంద్రబాబు, నారా భువనేశ్వరి పర్యటన
- కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించిన చంద్రబాబు దంపతులు
- అనంతరం షిరిడీ పయనం
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి గురువారం నాడు మహారాష్ట్రలో పర్యటించారు. తొలుత కొల్హాపూర్ లోని సుప్రసిద్ధ శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు.
అనంతరం షిరిడి పుణ్యక్షేత్రానికి వెళ్లారు. అక్కడ చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు సాయిబాబాను దర్శించుకున్నారు. వీరికి షిరిడీ ట్రస్ట్ వర్గాలు సంప్రదాయబద్ధ స్వాగతం పలికాయి.
దర్శనం అనంతరం చంద్రబాబు దంపతులను సత్కరించిన ఆలయ అధికారులు వారికి జ్ఞాపికను బహూకరించారు. సాయి భక్తులు గురువారం రోజును పరమ పవిత్రంగా భావిస్తారన్న సంగతి తెలిసిందే.
![](https://img.ap7am.com/froala-uploads/20240516fr66462291138b8.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20240516fr6646229bd174e.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20240516fr664622a716804.jpg)