Hyderabad Rain: హైదరాబాదులో వర్షం... సన్ రైజర్స్-గుజరాత్ మ్యాచ్ లో టాస్ ఆలస్యం

Toss delayed due to wet field in Hyderabad stadium
  • వర్షంతో తడిసి ముద్దయిన ఉప్పల్ స్టేడియం
  • చిత్తడిగా మారిన అవుట్ ఫీల్డ్
  • ఆలస్యంగా ప్రారంభం కానున్న మ్యాచ్
ఐపీఎల్ లో ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ కీలక మ్యాచ్ జరగాల్సి ఉండగా, హైదరాబాద్ లో వర్షం వల్ల ఇంతవరకు టాస్ కూడా వేయలేదు. ఈ సాయంత్రం హైదరాబాదులోని పలు ప్రాంతాలను వర్షం ముంచెత్తింది. ఉప్పల్ స్టేడియం వద్ద కూడా వర్షం పడడంతో అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. దాంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. 

ప్లే ఆఫ్ దశకు చేరేందుకు సన్ రైజర్స్ మరొక్క పాయింట్ దూరంంలో ఉంది. మరో మ్యాచ్ ఆడాల్సి ఉన్నప్పటికీ, ఇతర జట్ల సమీకరణాలతో పనిలేకుండా ప్లేఆఫ్ బెర్తు చేజిక్కించుకోవాలని సన్ రైజర్స్ ఆశిస్తోంది. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షార్పణం అయినా ఇరు జట్లకు చెరొక పాయింట్ లభిస్తుంది కాబట్టి, ఎలాంటి ఇబ్బంది లేకుండా సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ లోకి ప్రవేశిస్తుంది. అయితే అభిమానులు ఈ మ్యాచ్ జరగాలని, ఇందులో గెలిచి సన్ రైజర్స్ సగర్వంగా ప్లేఆఫ్స్ చేరాలని కోరుకుంటున్నారు. మరి వరుణుడు కరుణిస్తాడో, లేదో చూడాలి.
Hyderabad Rain
SRH
GT
Toss
Hyderabad

More Telugu News