Eesha Rebba: అమ్మకి సీరియస్ .. హండ్రెడ్ మిస్డ్ కాల్స్ .. నేను ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టాను: ఈషా రెబ్బా

Eesha Rebba Special

  • తెలుగు హీరోయిన్ గా ఈషా రెబ్బాకి క్రేజ్ 
  • తన తల్లికి హార్ట్ ప్రోబ్లం ఉండేదని వెల్లడి
  • డాక్టర్ మాటలను జీర్ణించుకోలేకపోయానని వివరణ 
  • అమ్మ అలా చనిపోయిందంటూ ఆవేదన  


ఈషా రెబ్బా .. అచ్చమైన తెలుగు అమ్మాయి. చేసిన సినిమాలు తక్కువే అయినా, సోషల్ మీడియాలో ఆమెకి ఉన్న ఫాలోయింగ్ ఎక్కువే. అలాంటి ఈషా రెబ్బా తాజా ఇంటర్వ్యూలో తన తల్లిని గురించి ప్రస్తావించింది. "అమ్మకి షుగర్ ఉండేది .. ఓ రోజున ఆమెకి ఒంట్లో బాగోలేకపోతే హాస్పిటల్ కి తీసుకుని వెళ్లాము. ఆమె హార్ట్ బీట్ చాలా తక్కువగా ఉందనీ, ఏడాదికి మించి బ్రతకడం కష్టమేనని డాక్టర్ చెప్పారు. 

సినిమాల్లో మాదిరిగా డాక్టర్ ఒక్కసారిగా అలా చెప్పడంతో, నేను షాక్ అయ్యాను. సాధారణంగా ఎవరికైనా అమ్మ ఎప్పటికీ ఉంటుందనే అనిపిస్తుంది. నేను కూడా అలాగే అనుకున్నాను. డాక్టర్స్ అలా చెబుతారుగానీ, ఏడాదిలో ఏమౌతుందిలే అనుకున్నాను. అమ్మకి సంబంధించిన జాగ్రత్తలు తీసుకున్నాను. ఆ తరువాత కొన్ని రోజులకు నేను వేరే ఊరు వెళ్లాను. 

ఆ రోజున మా అమ్మగారు తనకి ఎలాగో ఉందని మా డాడీతో చెప్పిందట. ఆయన నాకు కాల్ చేశారు. ఎప్పుడూ లేనిది ఆ రోజున నేను ఫోన్ సైలెంట్ మోడీలో పెట్టాను. తరువాత చూసుకుంటే హండ్రెడ్ మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అమ్మని హాస్పిటల్ కి తీసుకుని వెళుతూ ఉండగా కార్లోనే పోయిందని డాడీ చెప్పాడు. షుగర్ ఉన్నవారికీ హార్ట్ ఎటాక్ వచ్చినా పెయిన్ తెలియదట. అందువలన పెయిన్ వస్తున్న సంగతి అమ్మ చెప్పలేకపోయింది" అంటూ ఆ సంఘటనను గుర్తుచేసుకుంది. 

  • Loading...

More Telugu News