Eesha Reba: ఎవరినైనా కలుసుకోవాలంటే భయంవేసేది: ఈషా రెబ్బా

Eesha Rebba Interview

  • హీరోయిన్ గా కొనసాగుతున్న ఈషా రెబ్బా 
  • రంగు విషయంలో అవమానించారని వ్యాఖ్య 
  • అక్కడ భాషకి ప్రాధాన్యతనిస్తారని వివరణ  
  • తనకి పట్టుదల ఎక్కువని వెల్లడి

ఈషా రెబ్బా .. పక్కా తెలుగు అమ్మాయి. కథానాయికగా ఇక్కడ నిలదొక్కుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఐడ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "నేను ఇక్కడ మొదటి సినిమా కోసం ఆడిషన్స్ కి వెళుతుంటే, తెలుగు అమ్మాయివని చెప్పకు .. నార్త్ నుంచి వచ్చినట్టుగా చెప్పు అని నా ఫ్రెండ్స్ చెప్పారు. కానీ అలా చెప్పడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను తెలుగు అమ్మయిననే చెప్పాను" అని అన్నారు. 

"ఇక్కడ తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ రావడం కష్టమే. కెమెరా ముందుకు వెళ్లగానే తెలుగు అమ్మాయినని చెప్పగానే అక్కడ ఉన్న వాళ్లంతా మొహాలు మాడ్చేస్తారు. అదే మలయాళ సినిమాల్లో అయితే, తమ భాష వచ్చినవారికే వాళ్లు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. భాషరాని వారిని పెట్టుకుని, వాళ్లు సమయాన్ని వృథా చేసుకోరు. నేను ఇక్కడ ఒక సినిమా చేసేలోగా ఒక మలయాళ హీరో 6 సినిమాలు చేశాడు" అని అన్నారు. 

కెరియర్ ఆరంభంలో నల్లగా ఉన్నాననే అవమానాలు కూడా నాకు ఎదురయ్యాయి. ఆడిషన్స్ కి వెళితే, ఎంతనల్లగా ఉన్నారో చూడండి అని నాకు చూపించేవారు. దాంతో అవకాశాల కోసం ఎవరినైనా కలవాలంటే నాకు భయం వేసేది. కానీ నాలో కొంచెం మొండితనం కూడా ఉంది. అందువలన ఎవరేమనుకుంటే అనుకోనీ అన్నట్టుగా ముందుకు వెళ్లాను" అని చెప్పారు.  

Eesha Reba
Actress
Tollywood
  • Loading...

More Telugu News