Jana Reddy: ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది: జానారెడ్డి జోస్యం

Jana Reddy predicts India Inc will come into power

  • తెలంగాణలో మెజార్టీ సీట్లు వస్తాయని విశ్వాసం
  • ఏ పార్టీలో ఉన్నా టిక్కెట్లు, పదవులు అడగలేదన్న జానారెడ్డి
  • తనకు ఉన్న ప్రజాదరణ చూసి పార్టీలే అవకాశాలు ఇచ్చాయని వ్యాఖ్య
  • తప్పిదాలే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణమన్న జానారెడ్డి

కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. తెలంగాణలో తమకు మెజార్టీ సీట్లు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... తాను ఏ పార్టీలో ఉన్నా టిక్కెట్లు, పదవులు అడగలేదన్నారు. తనకు ఉన్న ప్రజాదరణ చూసి పార్టీలే అవకాశాలు ఇచ్చాయని తెలిపారు. బీఆర్ఎస్ తప్పిదాలే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమికి కారణమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ మాటలను ప్రజలు విశ్వసించలేదన్నారు.

Jana Reddy
Congress
Revanth Reddy
  • Loading...

More Telugu News