Deekshith Shetty: కళ్లు మూస్తే కాలంలో ప్రయాణం .. 'బ్లింక్' మూవీ కథ ఇదే!

Blink Movie Updte

  • దీక్షిత్ శెట్టి హీరోగా 'బ్లింక్'
  • టైమ్ ట్రావెల్ నేపథ్యంలో నడిచే కథ 
  • దర్శకత్వం వహించిన శ్రీనిధి 
  • అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్న సినిమా


దీక్షిత్ శెట్టి గుర్తున్నాడా .. అదే 'దసరా' సినిమాలో కీర్తి సురేశ్ కి లవర్ గా కనిపించిన యువకుడు. అతను ఇప్పుడు కన్నడలో హీరోగా నిలదొక్కుకునే పనిలో ఉన్నాడు. అలా కన్నడలో ఆయన చేసిన 'బ్లింక్' సినిమా, మార్చి 8వ తేదీన థియేటర్లకు వచ్చింది. అక్కడ ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. కంటెంట్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. 

అలాంటి ఆ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో కన్నడలోనే అందుబాటులోకి వచ్చింది. త్వరలో తెలుగుతో పాటు ఇతర భాషల్లోను అందుబాటులోకి రానుంది. ఈ సినిమాలో హీరో పీజీ పరీక్షలలో ఫెయిల్ అవుతాడు. ఆ విషయం తల్లికి చెప్పకుండా దాస్తాడు. మంచి ఉద్యోగం సాధించి తల్లి ఎదురుగా నిలబడాలనేది అతని కోరిక. ఒక వైపున ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే మరో వైపున స్వప్నను ప్రేమిస్తూ ఉంటాడు. 

ఒకానొక దశ తరువాత అతను కళ్లు మూసుకుంటే చాలు, కాలంలో ముందుకుగానీ .. వెనక్కి గాని వెళుతూ ఉంటాడు. అలా 1996 నుంచి 2035కి మధ్య కాలంలో అతను తిరుగుతూ ఉంటాడు. అతనికి అలా ఎందుకు జరుగుతుంది? అప్పుడు అతను ఏం చేస్తాడు? అనేది కథ. సైన్స్ ఫిక్షన్ జోనర్లో నడిచే ఈ సినిమాకి శ్రీనిధి దర్శకత్వం వహించారు. 

Deekshith Shetty
Blink Movie
  • Loading...

More Telugu News