Pulivarti Nani: తిరుపతి పద్మావతి వర్సిటీ వద్ద ఉద్రిక్తత... టీడీపీ నిరసనకారులపై లాఠీచార్జి

Police lathi charge on TDP protesters in Tirupati
  • తిరుపతిలో పులివర్తి నానిపై దాడి
  • రోడ్డుపై బైఠాయించిన టీడీపీ కార్యకర్తలు
  • లాఠీచార్జితో చెదరగొట్టిన పోలీసులు
తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఈ సాయంత్రం చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరగడం తెలిసిందే. ఈ దాడిని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు పద్మావతి వర్సిటీ రోడ్డుపై బైఠాయించాయి. వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పులివర్తి నాని అనుచరులు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో, పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులపై లాఠీచార్జి చేసి, వారిని అక్కడ్నించి చెదరగొట్టారు. సమీపంలోని అపార్ట్ మెంట్లలోకి వెళుతున్న వ్యక్తులపైనా పోలీసులు లాఠీలు ఝళిపించారు. 

తొలుత సాధారణ పోలీసులు రాగా, వారితో టీడీపీ నేతలకు వాగ్వాదం జరిగింది. తమకు న్యాయం చేయాలని టీడీపీ కార్యకర్తలు కోరారు. ఈ దశలో ప్రత్యేక బలగాలు రంగప్రవేశం చేసి టీడీపీ కార్యకర్తలపై లాఠీలతో విరుకుపడ్డాయి.
Pulivarti Nani
Protest
Police
TDP
Tirupati

More Telugu News