Narendra Modi: ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్... ఫొటోలు ఇవిగో!
![Chandrababu and Pawan Kalyan attends PM Modi nomination filing event](https://imgd.ap7am.com/thumbnail/cr-20240514tn66434b134083f.jpg)
- వారణాసిలో నేడు నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని మోదీ
- నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ లకు ఆహ్వానం
- నిన్ననే వారణాసి వెళ్లిన పవన్... ఈ ఉదయం వారణాసి చేరుకున్న చంద్రబాబు
- మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ అగ్రనేతలు
- ఏపీలో పోలింగ్ ట్రెండ్ పై చంద్రబాబు, పవన్ లను అభినందించిన మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధాని అయ్యేందుకు ఉరకలేస్తున్నారు. ఇవాళ ఆయన ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ వేశారు. ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో ఎన్డీయే కూటమి భాగస్వాములు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోదీ... ఏపీలో నిన్నటి పోలింగ్ ట్రెండ్ ను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు, పవన్ లతో ఉత్సాహంగా మాట్లాడారు. వారిని అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి చంద్రబాబు, పవన్ కూడా బెస్ట్ విషెస్ తెలిపారు.
![](https://img.ap7am.com/froala-uploads/20240514fr66434a56d109e.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20240514fr66434a6068861.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20240514fr66434a6e7192b.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20240514fr66434a78dbee8.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20240514fr66434a84965b0.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20240514fr66434b018eae3.jpg)