Vidya Vasula Aham: ప్రేమకీ .. పెళ్లికి మధ్యలో 'అహం' అడుగుపెడితే .. ఆహాలో!

Vidya Vasula Aham

  • ఓటీటీ మూవీగా 'విద్య వాసుల అహం'
  • ప్రధాన పాత్రల్లో శివాని రాజశేఖర్ - రాహుల్ విజయ్
  • 'అహం' అనే అంశం చుట్టూ తిరిగే కథ 
  • ఈ నెల 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్


ప్రేమలో పడాలంటే ముందుగా పరిచయం జరగాలి. పరిచయం ముదురుతూ ఉండగానే, ఒకరి ఆలోచనలు .. అభిరుచులు .. అభిప్రాయాలు మరొకరికి ఉన్నతంగా అనిపిస్తాయి. ఎంత గొప్ప వ్యక్తిత్వం .. ఎంతటి ఔన్నత్యం అంటూ ఒకరిని గురించి ఒకరు గొప్పగా ఊహించుకుంటారు. మచ్చలేని ప్రేమికులమంటే మేమే అనే స్థాయికి చేరుకుంటారు. 

ఎవరూ ఎక్కువ కాలం నటించలేరు .. కాస్త సమయం తీసుకుంటే బయటపడిపోతారన్నట్టుగా ప్రేమికుల మధ్య అలకలు మొదలవుతాయి. ఎవరికి వారు తమకి ఉన్నది ఆత్మాభిమానమనీ, ఎదుటివారికి ఉన్నది అహం అనే అనుకుంటారు. అసలు గొడవ అక్కడి నుంచే మొదలవుతుంది. అలాంటి ఒక గొడవ చుట్టూ అల్లుకున్న కథనే 'విద్య వాసుల అహం'.

 ఈ సినిమా ఈ నెల 17వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. విద్య - వాసు అనే ప్రధానమైన పాత్రలో శివాని రాజశేఖర్ .. రాహుల్ విజయ్ నటించారు. మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించాడు. 'అహం' అనేది ఒక జంట మధ్య ఎలాంటి తుఫాన్ సృష్టించిందనేది కథ. ఇతర ముఖ్యమైన పాత్రలలో అవసరాల శ్రీనివాస్ .. అభినయ .. తనికెళ్ల భరణి కనిపించనున్నారు. 

Vidya Vasula Aham
Shivani Rajasekhar
Rahul Vijay
  • Loading...

More Telugu News