Chandrababu: ఈ ఆడియో మెసేజ్ నిజం కాదు... ఎవరూ నమ్మొద్దు: వైసీపీపై చంద్రబాబు ఫైర్

Chandrababu fires on YCP

  • చంద్రబాబు పేరిట ఆడియో సందేశం సర్క్యులేట్
  • పథకాల్లేవ్ ఏం లేవ్ అంటూ చంద్రబాబు పేర్కొన్నట్టు ఆడియో క్లిప్
  • ప్రజలను తప్పుదోవ పట్టించే తప్పుడు ప్రచారం అంటూ చంద్రబాబు ఆగ్రహం
  • పోలీసులు, ఎన్నికల అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

తన పేరిట సోషల్ మీడియాలో ఓ ఆడియో సందేశం వైరల్ అవుతుండడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. పథకాల్లేవ్ ఏం లేవ్... మా ఆస్తులన్నీ అమరావతిలోనే ఉన్నాయి... త్వరలోనే మీకు లాభాలు చూపిస్తా... అంటూ తన వాయిస్ తో ఈ మెసేజ్ రూపొందించారని చంద్రబాబు మండిపడ్డారు. 

"ఓటమి అంచుల్లో ఉన్నా వైసీపీకి బుద్ధి రావడం లేదు. ఇంకా ఫేక్ వీడియోలు, ఆడియోలు, పోస్టులతో జనాలను మోసం చేయాలని చూస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు డీప్ ఫేక్ ఆడియోలు, ఫేక్ లెటర్లు సృష్టిస్తున్నారు. ప్రజలు ఎవరూ ఈ తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు. కుట్రలతో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై పోలీసులు, ఎన్నికల అధికారులు తక్షణమే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి" అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Chandrababu
Audio Message
Fake
TDP
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News