Komatireddy Venkat Reddy: నాకు ఏ పదవుల మీద ఆశ లేదు.. నా తెలంగాణ బాగుంటే చాలు: మంత్రి కోమటిరెడ్డి
![Minister Komatireddy Venkat Reddy Criticizes BRS Chief KCR](https://imgd.ap7am.com/thumbnail/cr-20240509tn663ce003a5e6f.jpg)
- సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి ప్రశంసలు
- కేసీఆర్‌లా రేవంత్ దొంగ ఉద్యమకారుడు కాదంటూ చురకలు
- తెలంగాణ కోసం పదవిని తృణప్రాయంగా వదిలేసిన ఉద్యమకారుడినన్న కోమటిరెడ్డి
కాంగ్రెస్ నేత, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. రేవంత్ నిజమైన నాయకుడని అన్నారు. కేసీఆర్‌లా ఎలక్షన్.. కలెక్షన్.. బై ఎలక్షన్ దొంగ ఉద్యమకారుడు కాదని విమర్శించారు. తనతో పాటు సర్వం ధారపోసిన నాయకుడు కేవలం రేవంత్ మాత్రమేనని అన్నారు. మంత్రి పదవుల కోసం తిరిగే వ్యక్తి కాదన్నారు.
ఇక తనకు ఏ పదవుల మీద ఆశ లేదని, తెలంగాణ బాగుంటే చాలన్నారు. ఏనాడు పదవుల కోసం పాకులాడలేదని తెలిపారు. తనకు ఏ పదవి వద్దన్నారు. ప్రజల సమస్యలు తీర్చినప్పుడు కలిగే ఆనందం.. ఏ పదవిలోనో లేదు.. రాదని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణ కోసం పదవిని తృణప్రాయంగా వదిలేసిన ఉద్యమకారుడ్ని అని అన్నారు.