Ram: త్రివిక్రమ్ తో రామ్ .. పాన్ ఇండియా ప్లాన్!

Ram in Trivikram Movie

  • పూరి సినిమాతో బిజీగా ఉన్న రామ్ 
  • త్రివిక్రమ్ కథకి గ్రీన్ సిగ్నల్ 
  • త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు టాక్ 
  • లైన్లోనే ఉన్న హరీశ్ శంకర్   


రామ్ చాలా కాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. థియేటర్ వరకూ వచ్చిన సినిమా, ఆయనకి దిగులునే మిగిల్చి వెళుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పూరి దర్శకత్వంలో 'డబుల్ ఇస్మార్ట్' చేస్తున్నాడు. ఫస్టు పార్టు మాదిరిగా ఈ సినిమా కూడా తప్పకుండా పెద్ద హిట్ కొడుతుందని ఆయన భావిస్తున్నాడు. ఆ తరువాత సినిమా ఎవరితో ఉండొచ్చుననేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. త్రివిక్రమ్ ఒక కథను వినిపించడం, రామ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని అంటున్నారు. ఈ పాన్ ఇండియా మూవీలో త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్ .. రామ్ మార్క్ మాస్ యాక్షన్ ఉంటుందని అంటున్నారు. త్వరలోనే సెట్స్ పైకి ఈ సినిమా వెళ్లడం ఖాయమని చెబుతున్నారు. రామ్ జోడీగా భాగ్యశ్రీ బోర్సే సందడి చేసే అవకాశం ఉందని అంటున్నారు.

ఇటీవలే 'గుంటూరు కారం' సినిమాను థియేటర్స్ కి తీసుకొచ్చిన త్రివిక్రమ్, ఆ తరువాత సినిమాను అల్లు అర్జున్ తో చేయవలసి ఉంది. ఆయన అందుబాటులోకి రావడానికి ఇంకా సమయం ఉండటంతో రామ్ తో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇక త్రివిక్రమ్ తరువాత హరీశ్ శంకర్ తో కూడా ఒక సినిమా చేయడానికి రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. మొత్తానికి రామ్ దూకుడు పెంచుతున్నాడన్న మాట. 

Ram
Trivikram Srinivas
Harish Shankar
  • Loading...

More Telugu News