Sai Pallavi: సాయిపల్లవి బర్త్ డే స్పెషల్ వీడియోను రిలీజ్ చేసిన 'తండేల్' టీమ్!

Sai Pallavi Birthday Special Video

  • సాయిపల్లవి తాజా చిత్రంగా 'తండేల్'
  • సముద్రం నేపథ్యంలో నడిచే కథ
  • ఈ రోజున ఆమె పుట్టినరోజు 
  • ఆకట్టుకుంటున్న స్పెషల్ వీడియో


సాయిపల్లవి .. 'ఫిదా' సినిమాతో తెలుగింటి ఆడపడుచుగా మారిపోయింది. ఈ సినిమాలో ఆమె తెలంగాణ యాస మాట్లాడటం చూసి, తెలంగాణ నుంచి వచ్చిన హీరోయిన్ అనుకున్నారు. అంతలా ఆమె ఆ పాత్రలో ఆమె మెప్పించింది. అలాంటి సాయిపల్లవి ఆ తరువాత వరుస హిట్స్ తో ఇక్కడి ప్రేక్షకులకు మరింత చేరువైంది. తన సినిమాకి వచ్చిన ప్రతి ఒక్కరినీ తన అభిమానులుగా మార్చేసింది. 

సాయిపల్లవి తన సినిమాలకి సంబంధించిన కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. తనకి నచ్చకపోతే పారితోషికం ఎంత ఇస్తామని చెప్పినా ఆమె చేయదు. ఆమెలోని ఈ వ్యక్తిత్వమే ఆమెకి మరింత అభిమానులను తెచ్చిపెట్టింది. అలాంటి సాయిపల్లవి పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా 'తండేల్' సినిమా టీమ్ ఆమెకి విషెస్ చెబుతూ, ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. 

చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా 'తండేల్' సినిమా రూపొందుతోంది. సముద్రం . జాలరులు జీవితాల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. సాయిపల్లవి గతంలో చేసిన సినిమాల తాలూకు క్లిప్స్ ను జోడిస్తూ, 'తండేల్' మేకింగ్ షాట్స్ తో రూపొందించిన ఈ వీడియో ఆమె అభిమానులను ఆకట్టుకునేలా ఉంది.

More Telugu News