Thummala: రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన

Minister Thummala key announcement on Rythu Bharosa
  • రాబోయే బడ్జెట్ సమావేశాల తర్వాత రైతు భరోసా కింద రూ.15వేలు ఇస్తామని స్పష్టీకరణ
  • వర్షాలకు పంట నష్టపోయిన రైతులు ఎవరూ అధైర్యపడవద్దన్న మంత్రి
  • తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు అండగా ఉంటామని హామీ
రైతు భరోసాపై తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక ప్రకటన చేశారు. రాబోయే బడ్జెట్ సమావేశాల తర్వాత రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని స్పష్టం చేశారు. ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ కిసాన్ మోర్చా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులు ఎవరూ అధైర్యపడవద్దన్నారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. ఇక నుంచి పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు. పంద్రాగస్ట్ లోగా రైతు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు.
Thummala
Rythu Bharosa
Telangana
Congress

More Telugu News