Venneradai Nirmala: అందుకే నయనతార అంటే ఇష్టం: నటి వెన్నిరాడై నిర్మల

Venniradai Nirmala Interview

  • 70వ దశకంలో అందాల హీరోయిన్ గా పేరు
  • ఆ కారణంగానే సినిమాలు తగ్గించానని వెల్లడి 
  • ధనుశ్ ప్లానింగును ఇష్టపడతానని వ్యాఖ్య 
  • నయనతార ఆత్మవిశ్వాసం నచ్చుతుందని వివరణ  


వెన్నిరాడై నిర్మల .. 1970లలో కథానాయికగా తన జోరును చూపించిన నటి. అప్పట్లో అందమైన కథానాయికల జాబితాలో ఆమె పేరు ముందువరుసలో కనిపించేది. అక్కినేని .. కృష్ణ .. శోభన్ బాబు .. కృష్ణంరాజు .. చలం వంటి హీరోల సినిమాలలో ఆమె మెరిశారు. 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన కెరియర్ గురించిన వివరాలను ముచ్చటించారు.

" మా నాన్నగారికి సినిమాలన్నా .. సినిమా పాటలన్నా పెద్దగా ఇష్టం ఉండేది కాదు. అందువలన ఆయన నాకు క్లాసికల్ డాన్స్ నేర్పించారు. ఒకసారి ఒక ప్రదర్శన తరువాత అంతా నన్ను మెచ్చుకోవడం చూసి, సినిమాల్లో చేయడానికి ఒప్పుకున్నారు. అలా నేను ముందుగా తమిళ సినిమాలు .. ఆ తరువాత తెలుగు సినిమాలు చేశాను. ఆ తరువాత కాలంలో సెట్స్ లో గౌరవ మర్యాదలు తెలిసినవారు తగ్గడం వలన సినిమాలు మానేయవలసి వచ్చింది" అని అన్నారు. 

" ఈ జనరేషన్ గురించి చెప్పాలంటే నాకు ధనుశ్ ప్లానింగ్ నచ్చుతుంది. డిఫరెంట్ కథలను .. పాత్రలను సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్లేతీరు బాగుందనిపిస్తుంది. అలాగే నాయనతార కూడా చాలా ఇష్టం. జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నా, తన కెరియర్ ను ధైర్యంగా ముందుకు తీసుకుని వెళ్లే ఆమె పద్ధతి నాకు బాగా నచ్చుతుంది" అని చెప్పారు. 

Venneradai Nirmala
Actress
Dhanush
Nayanatara
  • Loading...

More Telugu News