Google: భారత మార్కెట్‌లో గూగుల్ పిక్సెల్ 8ఏ స్మార్ట్‌ఫోన్ విడుదల
- 8జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ. 52,999, 8జీబీ+ 256జీబీ వేరియంట్ రేటు రూ. 59,999గా ప్రకటన
- 14న ఉదయం 6:30 గంటల నుంచి విక్రయాల ప్రారంభం
- ఫ్లిప్‌కార్ట్‌పై ప్రీ-ఆర్డర్‌కు అవకాశం
చాలా కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘గూగుల్ పిక్సెల్ 8ఏ’ స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్‌లో విడుదలయ్యాయి. సరికొత్త డిజైన్, టెన్సార్ జీ3 ఎస్‌వోసీ చిప్‌సెట్‌తో పాటు గతంలో పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్లకే పరిమితమైన ఏఐ ఫీచర్లు వంటి కొత్త హంగులతో ఈ ఫోన్‌ను గూగుల్ తీసుకొచ్చింది. మే 14, 2024న జరగనున్న గూగుల్ వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్‌కు ఒక వారం రోజుల ముందు గూగుల్ ఈ ప్రకటన చేసింది.
గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్లు అలోయ్, బే, అబ్సిడియన్, పోర్సీలెయిన్ అనే నాలుగు రంగుల్లో లభ్యమవుతున్నాయి. ఇక 8జీబీ ర్యామ్, రెండు స్టోరేజీ వేరియెంట్లలో డిజైన్ చేశారు. 8జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ. 52,999, 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ. 59,999గా ఉన్నాయి.
మే 14న ఉదయం 6:30 గంటల నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయని ప్రకటనలో కంపెనీ వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్‌పై ప్రీ-ఆర్డర్ అవకాశం ఉంది. రూ.4000 వేల వరకు బ్యాంక్ ఆఫర్లతో పాటు ఎంపిక చేసిన బ్యాంకుల కార్డులపై 12 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రకటించింది. పిక్సెల్ 8ఏ ప్రీ-ఆర్డర్ చేసిన కస్టమర్లు పిక్సెల్ బడ్స్ ఏ-సిరీస్‌ను కేవలం రూ. 999తో కొనుగోలు చేయవచ్చని వెల్లడించింది.
ఇక ఈ ఫోన్ ప్రత్యేకతల విషయానికి వస్తే.. టెన్సార్ జీ3 చిప్‌సెట్, టైటాన్ ఎం2 సెక్యూరిటీ కోప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14 వంటివి ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ఇక 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఓఎల్ఈడీ ప్యానెల్‌తో ఫ్లాట్ 6.1-అంగుళాల సూపర్ డిస్‌ప్లే, కెమెరా ముందు భాగంలో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, వెనుకవైపు 13-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఇక 4,492ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, 7.5వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్, 18వాట్స్ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
వైఫై 6, బ్లూటూత్ 5.3, టైప్-సీ యూఎస్‌బీ పోర్ట్, జీపీఎస్ నావిగేషన్ సిస్టమ్ వంటివి ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. ఒక వర్చువల్ ఈసిమ్ (eSIM) తో పాటు ఒక ఫిజికల్ సిమ్‌ను వాడుకోవచ్చు. కాగా గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్ డిజైన్ పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్ల మాదిరిగానే ఉంటుంది. నిజానికి గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్లు గతేడాదే మార్కెట్లో విడుదలయ్యాయి. చక్కటి ఆదరణ పొంది భారీగా సేల్ అయ్యాయి. దీంతో మరిన్ని అదనపు అప్‌డేటెడ్ ఫీచర్లతో సరికొత్తగా గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్లను విడుదల చేసింది.