మీ వైసీపీ సర్కారుకి మే13న ఎక్స్ పైరీ డేట్ ఫిక్స్ అయ్యింది కాటసానీ!: నారా లోకేశ్
- బనగానపల్లెలో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి అర్ధాంగిపై దాడి
- కాటసాని రామిరెడ్డి కొడుకు ఓబుల్ రెడ్డి అనుచరుల దాడిని ఖండిస్తున్నామన్న లోకేశ్
- ఓటమి భయంతో మహిళలపై దాడులు చేస్తుండడం దారుణమంటూ ట్వీట్
ఐదేళ్లుగా జనాలను కాటు వేసిన కాటసాని రామిరెడ్డి కుటుంబం ఇప్పుడు ఓటమి భయంతో మహిళలపై కూడా దాడులకు పాల్పడడం చాలా దారుణం అని లోకేశ్ పేర్కొన్నారు. మీ వైసీపీ సర్కారుకు, అరాచకాలకు మే 13న ఎక్స్ పైరీ డేట్ ఫిక్స్ అయింది కాటసానీ అంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు దాడి వీడియోను కూడా లోకేశ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.