iPhone 17 Leaks: ఐఫోన్ 17 సిరీస్‌లో భారీ మార్పులు.. ఎలా ఉంటుందో చెప్పేసిన లీకులు!

iPhone 17 leaks Apple likely to  change many things

  • ఐఫోన్ 16 లైనప్ ప్రకటించడానికి ముందే ఐఫోన్ 17 లీకులు
  • రీఫ్రెష్ లుక్‌, డైనమిక్ ఐలండ్‌తో వచ్చే అవకాశం
  • మరింత మెరుగైన కెమెరా, ర్యామ్ పెంపు

ఆపిల్ తన తాజా ఐఫోన్ 16 లైనప్‌ను ప్రకటించడానికి ముందే ఐఫోన్ 17 ఫోన్‌కు సంబంధించిన లైనప్ ప్లాన్స్ లీకయ్యాయి. ఈ లైనప్‌లో ఐఫోన్ భారీ మార్పులు చేస్తున్నట్టు లీకులను బట్టి తెలుస్తోంది. రిఫ్రెష్ లుక్, ఫ్రంట్ కెమెరాను మరింత మెరుగు పరచడంతో పాటు కొద్దిపాటి డైనమిక్ ఐలండ్‌తో రావొచ్చని లీకులు వెల్లడించాయి. హైటాంగ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ అనలిస్ట్ జెఫ్ పు ఇన్వెస్టర్ నోట్ ప్రకారం.. ఐఫోన్ 17 సిరీస్‌ను ఈసారి స్లిమ్‌గా తీసుకురావాలని యోచిస్తోంది. ఐఫోన్ 17 సిరీస్‌లో నాలుగు వేరియంట్లు ఉంటాయి. ప్లస్ వేరియంట్‌ను మాత్రం స్లిమ్‌గా తీర్చిదిద్దుతోంది. 

ఐఫోన్ 17 సిరీస్ ఇలా ఉండే అవకాశం ఉంది
ఐఫోన్ 17
 6.1 అంగుళాల డిస్‌ప్లే
ఐఫోన్ 17 స్లిమ్ 
6.6 అంగుళాల డిస్‌ప్లే 
ఐఫోన్ 17 ప్రొ 
6.3 అంగుళాల డిస్‌ప్లే 
ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్ 
6.9 అంగుళాల డిస్‌ప్లే 

ఐఫోన్ 17, ఐఫోన్ 17 స్లిమ్, ఐఫోన్ 17 ప్రొ మోడళ్లు అల్యూమినియం డిజైన్‌తో వచ్చే అవకాశం ఉంది. ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్‌ను మాత్రం టైటానియం నిర్మాణాన్ని కలిగి ఉంటుందని సమాచారం. 

ఐఫోన్ 17 సిరీస్ స్పెసిఫికేషన్లు: ఐఫోన్ 17, ఐఫోన్ 17 స్లిమ్ వేరియంట్లు 8 జీబీ ర్యామ్‌తో ఏ18, లేదంటే ఏ19 బయోనిక్ చిప్‌సెట్‌తో వచ్చే అవకాశం ఉంది. ఐఫోన్ 17 ప్రొ, ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్ 12 జీబీ ర్యామ్, ఏ 19 ప్రొ చిప్‌సెట్‌తో రానున్నాయి. ఐఫోన్ 17 సిరీస్‌లో 24 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉపయోగించనున్నారు. ఐఫోన్ 15 సిరీస్‌లో 12 ఎంపీ కెమెరాను మాత్రమే ఉపయోగించారు. ఇందులో దానిని డబుల్ చేస్తున్నారు.

More Telugu News